అంతంతపురం జిల్లా / గుత్తి: అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేయుచున్న టీచర్లు మరియు ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయంతోనే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ మరియు బాలికల హైస్కూల్లో జరిగిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు విద్యా వ్యవస్థను పటిష్ట పాఠశాలనికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి సంవత్సరం పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి మీటింగ్లను ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే నిర్వహించడం తో సమస్య పరిష్కారం కాదని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ప్రతి నెల, రెండు నెలలకు ఒకసారి పాఠశాలను సందర్శించి పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు విద్యాబోధనపై ఆరా తీయాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కరించి విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరు తమవంతుగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతో పాటు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, డిప్యూటీ డిఇఓ మల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కలచెరువు ప్రతాప్, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు చికెన్ శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దిల్ కా శ్రీనివాసులు, న్యాయవాది సోమశేఖర్, సీనియర్ నాయకులు సుంకన్న, కోనంకి కృష్ణ, రామకృష్ణ తోపాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు









