అనంతపూర్ జిల్లా / గుత్తి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వర్ధంతి పురస్కరించుకుని గుత్తి పట్టణంలోని పలు ప్రాంతాలైన ఎన్టీఆర్ సర్కిల్, గుంతకల్లు రోడ్డులో గల రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పెన్షనర్ భవనంలో, కుల సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు వ్యక్తుల మాట్లాడుతూ డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతిని సామాజిక సమర సతా దివస్ గా పిలుచుకుంటామని, అంబేద్కర్ విధివిధానాల్లో ప్రధానంగా సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ స్వభావం అనే సూత్రాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. ముఖ్యంగా అంటరానితనం, సమాజంలో కుల వివక్ష నిర్మూలన చేయాలని, అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, చికెన్ శ్రీనివాసులు, రేణుక, కృష్ణ గోపాల్, వైయస్ఆర్ సీపీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందె వరలక్ష్మి, మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా,వరదరాజులు, బీఎస్పీ నాయకులు గద్దల నాగభూషణం, వెంకట కొండయ్య, బండల రామాంజనేయులు, ప్రభాకర్ ప్రభాకర్, సిపిఐ నాయకులు రామదాసు, షఫీ, సిపిఎం నాయకులు నిర్మల, రేణుక, మల్లేసు, మల్లికార్జున ఎమ్మార్పీఎస్ నాయకులు తురకపల్లి ఈరన్న, నగదానిసత్య, చలపతి, హమాలీ రామాంజి, విజయ్, చిన్ని గణేష్ పెన్షనర్స్ జన్నే కుళ్లాయి బాబు, శామ్యూల్, రామ్మోహన్, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









