అనంతపురం – తాడిపత్రి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని MRPS నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకుందామని సూచించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం సమానత్వ హక్కులు లభిస్తున్నాయని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్దామని కోరారు. ఈ కార్యక్రమంలో M. పెద్దిరాజు మాదిగ (MRPS సీనియర్ నాయకులు, తాడిపత్రి), రామ్మోహన్ మాదిగ (MRPS సీనియర్ నాయకులు, తాడిపత్రి), వీరయ్య మాదిగ (తాడిపత్రి నియోజకవర్గ VHPS వికలాంగుల అధ్యక్షులు), పెద్దిరాజు మాదిగ (పెద్దపప్పూరు MRPS మండల అధ్యక్షులు), లింగాల గురప్ప మాదిగ (MSP యాడికి మండలం కన్వీనర్), పకీరప్ప మాదిగ (MRPS నాయకులు) తదితరులు పాల్గొన్నారు.









