అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యురాలు గంజి మాల దేవి పలు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి పిల్లలకు అందించే ఆహారము, మరియు సరఫరా చేసిన ఆహార ఉత్పత్తులను పరిశీలించారు. స్థానిక స్టోర్ డీలర్లు ప్రభుత్వము ఇచ్చే కమిషన్ 100 రూపాయలు నుండి 200 రూపాయలకు పెంచాలని, గౌరవ వేతనం 7500 రూపాయలు ఇవ్వాలని, అలాగే ప్రతి నల 26వ తారీకు నుండి నెల ఆఖరి వరకు వృద్ధులకు వికలాంగులకు అంటి వద్దకే రేషన్ ఇవ్వడం వల్ల డీలర్లకు మరింత ఆర్థిక భారం పడుతున్నది కావున గత ప్రభుత్వంలో ఎండియు వ్యవస్థలో సహాయకులకు 5000 రూపాయలు వేతనం ఇచ్చేవారు. అదే విధంగా డీలర్లకు అందజేయాలని, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ను ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు దాదు పీర, బోయ నాగరాజు, శ్రీనివాస్ యాదవ్, అన్వర్ భాష, వేణుగోపాల్, సూరసింగన్నపల్లి ప్రసాద్, జాఫర్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.










