అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం తనయుడు గుత్తి టిడిపి బాధ్యుడు గుమ్మనూరు ఈశ్వర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిడిపి సీనియర్ నాయకులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణస్వామి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రేన్ సహాయముతో భారీ కాన్వాయ్ తో విచ్చేసిన ఆయనకు గజమాలతో పట్టణంలోకి స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చుతూ పెద్ద సంఖ్యలో అభిమానుల చేరి ద్విచక్ర వాహనాలు తో స్పందన ఫంక్షన్ హాల్ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ శ్రేణుల మధ్య వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జక్కలచెరువు ప్రతాప్ ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు శ్రీనివాసులు, తొండపాడు చిన్న రెడ్డి యాదవ్, వాల్మీకి వేణు, న్యాయవాది సోమశేఖర్, డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ, పిల్లిల సుధాకర్, స్టోర్ డీలర్లు మద్దిలేటి, స్టోర్ నాగరాజు, దాదు పీరా తదితరులు పాల్గొన్నారు.










