అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అర్బన్ సీఐ రామారావు నేతృత్వంలో ఎస్సై సురేష్ మరియు శక్తి టీం ఆధ్వర్యంలో స్థానిక కేజీబీవీ ఉన్నత పాఠశాల, కళాశాల నందు మరియు అమృత్ టాకీస్ వెనకాల ఉన్న దళితవాడ నందు మండల పరిధిలో ఉన్నటువంటి కరిడికొండ ఉన్నత పాఠశాలలోనూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు అమలుపరిచిన పలు చట్టాలైన పోక్సో చట్టం, ఎస్సీ ఎస్టీ చట్టాలు, dail 100 ప్రాముఖ్యతగురించి, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, ప్రకాష్, కానిస్టేబుల్ భాష తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










