అనంతపురం జిల్లా గుత్తి తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో భాగంగా రేపు తహశీల్దార్ కార్యాలయము ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భూముల మ్యుటేషన్, ఆర్.ఓ. ఆర్. (రికార్డు అఫ్ రైట్స్), యఫ్. లైన్. మరియు సబ్ డివిజన్ వంటి సమస్యలు పరిష్కరింప బడతాయి. కావున సదరు సమస్యలకు సంబంధించి పరిష్కారముకై మండల స్థాయి నందు తహశీల్దార్ వారిని సంప్రదించ వలసినదిగా కోరడమైనది. మండల స్థాయిలో తహసిల్దార్ కార్యాలయంలో పరిష్కారము కానీ సమస్యలు, ఆర్డీవో కార్యాలయమును సంప్రదించవలెను. కావున ప్రజలందరూ మండల స్థాయి నందు జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమమును సద్వినియోగం చేసుకోనవలసినదిగా తాసిల్దార్ పుణ్యవతి పత్రికా ప్రకటన విడుదల చేశారు.









