అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బోలికొండ రంగస్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడపత్రికలను గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు, గుత్తి టీడీపీ ఇంచార్జ్ యువనేత గుమ్మనూరు ఈశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శోభ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు భక్తి పారవశ్యాన్ని అనుభూతి చెందేలా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని ఆలయ అధికారులు, కమిటీ సభ్యులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు, ప్రసాదం, తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీ. చిన్న రెడ్డి యాదవ్, బీ. రంగస్వామి రెడ్డి యాదవ్, డీలర్ డేగ మద్దిలేటి, న్యాయవాది సోమశేఖర్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.









