అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకట శివుడు యాదవ్ తన స్వగృహం వద్ద టిడిపి నాయకులు అభిమానుల మధ్య కేక్ కత్తిరించి ఒకరికొకరు తినిపించుకుని నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుంటకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆర్ అండ్ బి అతిథి గృహము వద్ద పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు చేరి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు పూలమాలలు వేసి స్థానిక పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ మరియు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇరువురు మాట్లాడుతూ వైయస్సార్సీపీ పాలనలో దశ దిశ లేని నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రానికి పెట్టుబడుల ఆహ్వానం మరియు విద్యాశాఖలో తల్లికి వందనం లాంటి పెనుమార్పులతో, మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగ కల్పన, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి నారా లోకేష్ చేసిన పాదయాత్ర 164 స్థానాలు విజయం లభించడానికి ఆయన కృషి పట్టుదల కు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకురాలు పత్తి హిమబిందు గుత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జక్కలచెరువు ప్రతాప్ టిడిపి పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు చికెన్ శ్రీనివాసులు బద్రి వలి న్యాయవాది సోమశేఖర్ డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ పవన్ యాదవ్ సరోజమ్మ ఎస్ ఏం భష రామాంజనేయ ఆచారి రాజు రవి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









