అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన పల్లేటి మధుసూదన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పంచాయతీ రాజ్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి సూచన మేరకు ఈ నియామకం జరిగింది.
ఈ సందర్భంగా పల్లేటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఆయన పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వెంకటరామిరెడ్డి, జిల్లా నాయకులు మంజునాథ్ రెడ్డి, నైరుతి రెడ్డి, పంచాయతీ రాజ్ రాష్ట్ర ఉప కార్యదర్శి సీవీ రంగారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నియామకంపై వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా అలాగే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు.









