అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో గల తగ్గు దేవాలయం లో శ్రీ అనంత గజ గరుడ లక్ష్మీనారాయణ స్వామి వారి మహా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేకువ ఝామున అభిషేక అర్చనలు నిర్వహించారు. అనంతరం విష్ణుసహస్రనామ పారాయణం పఠించారు. శ్రీదేవి, భూదేవి, సమేత స్వామి వారి విగ్రహాలను శోభయమానంగా వివిధ పుష్ప మాలలతో అలంకరించి, గరుడ వాహనం పై ఉంచి గ్రామోత్సవం మంగళ వాయుధ్యాలతో నిర్వహించారు. గోవింద నామం స్మరిస్తూ ఉత్సవం చేశారు. భక్తులు ఇంటింటి వద్ద ఫల పుష్ప, తాంబూలం, కొబ్బరికాయ లు సమర్పించారు









