అనంతపురం జిల్లా గుత్తి అర్బన్ సీఐ రామారావు సూచన మేరకు ఎస్సై 2 అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా స్థానిక గాంధీ సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించవలెనని, కారు వాహనదారులు సీటు బెల్టులు ధరించి సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల భారీ స్థాయిలో మరణాలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడప రాదని హెచ్చరించారు. రోడ్డు హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.








