అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గౌతమీపురి ఎలక్ట్రీషియన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మోటార్ బాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యుత్ కార్మికులు జాతీయ ఎలక్ట్రిషన్ డే సందర్భంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయముకు చేరుకొని ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వము నుండి ఎటువంటి నివేశ స్థలాలు మరియు గృహములు మంజూరు కాలేదని, విద్యుత్ పనులు కూడా ఎక్కువగా లేనందువల్ల కుటుంబ పోషణ భారంగా ఉందని దయచేసి ప్రైవేట్ విద్యుత్ కార్మికులను నివేశ స్థలాలు మరియు గృహాల నిర్మాణాలకు తోడ్పాటు అందించాలని తాసిల్దార్ పుణ్యవతికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రానా ప్రతాప్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, ట్రెజరర్ విరుపాక్షి స్వామి, సభ్యులు శేఖర్, వెంకటరంగయ్య, వెంకటేష్ తదితర సభ్యులు, ఎలక్ట్రిషన్లు పాల్గొన్నారు.









