అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో రోడ్డు సేఫ్టీ మిషన్ మాసోత్సవాల పురస్కరించు కొని అవగాహన కల్పించే పోస్టర్లు, స్టిక్కర్లు సీఐ రామసుబ్బయ్య, ఎస్సై ఆంజనేయులు, గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు.ట్రాఫిక్ నిబంధనలు జరిమానాల కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసమేనని అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ఒక బాధ్యత కాదు, అది మనందరి కర్తవ్యం” అని వారి పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ఖాకి యూనిఫామ్ ను వితరణ గావించారు.ఈ కార్యక్రమానికి ఆటో డ్రైవర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సిఐ రామసుబ్బయ్య, ఎస్సై ఆంజనేయులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.









