అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గల ఫుట్బాల్ మైదానం నందు నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయ భవనాలను ను శుక్రవారం ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, సి ఎస్ ఐ ఆర్ డి రాయలసీమ డయాసిస్ బిషప్ దేవ వరప్రసాదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుండి మైనార్టీలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారని పేర్కొన్నారు. స్థానికంగా నూతన ఏర్పాటైన షాపింగ్ కాంప్లెక్స్ లు వ్యాపారాలు లాభసాటిగా నడుస్తూ వ్యాపారస్తులు మరింత అభివృద్ధి చెందాలని ఆయన తెలిపారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కొరత తీర్చడానికి సి ఎస్ ఐ ఆర్ డి సంస్థ వారి వేరొక ప్రదేశంలో నూతన భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ గావించారు. కార్యక్రమానికి ముందగా కోటకు వెళ్లే దారిలో సి ఎస్ ఐ టౌన్ చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్న శాసనసభ్యులకు క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఊరేగింపుగా బాణాసంచా పేల్చుతూ వ్యాపార సముదాయ భవనాల వద్దకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఏరియా సి ఎస్ ఐ ఆర్ డి ఇంచార్జ్ రసల్ కిరణ్ డేవిడ్ సన్, రాస్ట్రా క్రిస్టియన్ మైనారిటీ సెల్ నాయకులు స్వామి దాసు, సి యస్ ఐ చర్చి ఫాదర్స్ మరియు సభ్యులు ,గుత్తి పట్టణం మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అనుబంధ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు








