అనంతపురం జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామపంచాయతీలో వెలసిన శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కొరకు ప్రత్యేకమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సేవాగఢ్ లోని సేవాలాల్ మహరాజ్ ఆలయం పక్కనున్న సమావేశ హాల్ లో ఈనెల 13, 14, 15వ తేదీలలో నిర్వహించే శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు పక్కాగా ఉండాలని, ఎంట్రీ మరియు ఎగ్జిట్ జాగ్రత్తగా చూసుకోవాలని, ఆర్డీఓ, డిఎస్పీ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. శానిటేషన్ కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలని, ఇబ్బంది లేకుండా శానిటేషన్ చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ట్రస్ట్ వారితో సమన్వయం చేసుకుని తాగునీరు అందించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకుని మానిటర్ చేయాలన్నారు.







