అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని చాకలి గేరి, సాయిబాబా టాకీస్, ఎస్బిఐ బ్యాక్ సైడ్ అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం సూపర్వైజర్ రాజేశ్వరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దృష్టికి వచ్చిన బాల్య వివాహాలు వెంటనే ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఉన్నత అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేసి అరికట్టాలని అంగన్వాడీ సిబ్బందికి హెచ్చరించారు. సివియర్ అండర్ వెయిట్ (SUW) ఉన్న పిల్లలను గుర్తించి వారి గృహములను సందర్శించి, తక్కువ బరువును అధిగమించడానికి తగిన పోషక పదార్థాలు అందజేస్తూ, వైద్యుల సలహాలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులకు, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. దినచర్యలో భాగంగా ఆర్ ఎల్ ఎం ప్రకారం చిన్నారులకు పాఠాలు బోధించాలని తెలిపారు. ఈ బోధనలు మానసిక వికాసానికి తోడ్పడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నాగరత్న, చంద్ర లీల, విరజాక్షి అంగన్వాడి సహాయకులు సరోజ, హసీనా, పద్మావతి చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.








