contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుత్తి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ .. వారి సర్వసభ్య సమావేశం

అనంతపురం జిల్లా గుత్తి పట్టణం ఆర్ఎస్ రోడ్డులో గల వసుధ ఫంక్షన్ హాల్ లో ది గుత్తి కో – ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ వారు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అబ్దుల్ జిలాన్ మాట్లాడుతూ గత 103 సంవత్సరాలుగా వినియోగదారుల మన్ననలు పొందుతూ గుత్తి, గుత్తి ఆర్ఎస్, పామిడి, అనంతపురం, గుంతకల్లు, డోన్, కదిరి వంటి పట్టణాలలో ఏడు శాఖలుగా విస్తరించడం హర్షనీయదగ్గ విషయం అని తెలిపారు. ఇదే ఉత్సాహంతో బ్యాంకు నందలి మరిన్ని సేవలు ఖాతాదారులకు,వినియోగదారులకు అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో భాగంగా నూతనంగా బంగారు ఆభరణాలపై రుణ సౌకర్యం కల్పించామని, ఏ బ్యాంకు కల్పించని విధంగా దినసరి, నెలసరి కంతులతో రుణ విమోచన పొందవచ్చు అన్నారు. బంగారు ఆభరణాలపై ఒ.డి. సౌకర్యం కూడా కల్పించామని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా ఆర్.బి.ఐ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ లోన్ వసతి నిలిపివేయడం జరిగినది. ప్రస్తుతం బ్యాంకు నిబంధనలు అధిగమించడం వల్ల తిరిగి గృహ నిర్మాణ లోన్ సేవలు ప్రారంభించడం జరిగినది, కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే హౌస్ మార్టిగెజ్ లోన్ సకర్యం పొందవచ్చు అని తెలిపారు. లాకర్ సౌకర్యం, ఏటీఎం సౌకర్యం కూడా ఖాతాదారులకు కలవు అని తెలిపారు. ప్రస్తుతం ఏడు బ్రాంచ్ లకు కలిసి 16 మంది శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారని ఒక బ్రాంచ్ కు ఐదు నుండి ఆరుగురు ఉద్యోగాలు అవసరం అవుతాయి కాబట్టి సంబంధిత అధికారులకు కోరడం జరుగుతుందని ఖాతాదారులకు తెలిపారు. 2025 నుండి 2026 సంవత్సరముగాను 359.74 లక్షలు నికర లాభం గడించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మహమ్మద్ షరీఫ్, వైస్ చైర్మన్ రామ్మోహన్, డైరెక్టర్లు స్టోర్ నాగరాజ్ , కృష్ణ, మధుసూదన్ గుప్తా, రంగ ప్రసాద్, మహేష్ కుమార్, దాదా, సుధీర్ బాబు తదితర డైరెక్టర్లతోపాటు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :