అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్బన్ సి.ఐ రామారావు ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నుండి గాంధీ సర్కిల్, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వరకు మహిళల గౌరవం, సమానత్వం, భద్రతపై నినాదాలు చేస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ మాట్లాడుతూ మహిళల సాధికారత, భద్రత మరియు సమాన హక్కులపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ మహిళలు సమాజానికి వెన్నెముకలాంటి వారు, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత, మహిళలపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా మనమందరం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఎస్సైలు సురేష్ , అమీర్ ఖాన్, ఏఎస్ఐ మాణిక్యం మరియు పోలీస్ సిబ్బంది, పాఠశాల కళాశాల విద్యార్థినిలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.







