అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చేరుకున్న స్మశాన సాధనకై జీపు యాత్ర. కళ్యాణదుర్గం నుండి గుత్తి కీ చేరుకున్న జీపు యాత్ర నిర్వాహకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సాకే హరికు ఘనంగా స్వాగతం పలికిన దళిత శ్రేణులు. స్థానిక పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా లో ఉన్న స్మశాన వాటికలకు మౌలిక వసతులు కల్పించి, స్మశాన ప్రహరీ గోడలు నిర్మించి ఎక్కడైతే గ్రామాలలో స్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారో గుర్తించి ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ ప్రసాద్, సిపిఐ మండల కార్యదర్శి రామదాసు, ఏపీ ఎమ్మార్పీఎస్ గుంతకల్లు నియోజకవర్గం ఇంచార్జ్ అడవి రాముడు, మాల మహానాడు మండల నాయకుడు బండల రామాంజినేయులు, జనసేన నాయకుడు గుత్తి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మిద్దె ఓబులేసు, కెవిపిఎస్ మండల నాయకులు మల్లికార్జున వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








