contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుత్తిలో ఘనంగా అహుడా చైర్మన్ టీసీ వరుణ్ జన్మదిన వేడుకలు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా పట్టణంలోని చెరువుకట్ట సమీపంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుత్తి బస్టాండ్ వద్ద నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ఎదుగుదలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న సేవాతత్పరుడు టీసీ వరుణ్ అని కొనియాడారు. జన్మదిన వేడుకలకు దూరంగా, బాధ్యతలకు దగ్గరగా ఉంటూ ప్రజాసేవలో నిర్విరామంగా పనిచేస్తున్న నాయకుడు అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా జనసేన శ్రేణులు పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో టీసీ వరుణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గుత్తి మండల అధ్యక్షుడు చిన్న వెంకటేశులు, పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు వెంకటపతి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శులు గోరంట్ల నాగయ్య, మిద్దె ఓబులేష్, చంద్ర, వెంకటేష్, జింక హేమంత్, మురళి నాయక్, ధనంజయ, హసేన్ భాష, గోపాల్, నాగరాజు, జయరాజ్, రవికుమార్, ధోని ముక్కల విజయ్ కుమార్, హాజీ, బాషా తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :