అనంతపురం జిల్లా, గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణం ఆర్.ఎస్. ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాహిత ఆశయాలు, పేదల సంక్షేమం మరియు సామాజిక న్యాయం అనే విలువలను మార్గదర్శకంగా తీసుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 16వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల నమ్మకం, సేవా తత్వంతో పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పార్టీ మరింత బలంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
వేడుకలలో భాగంగా నాయకులు మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ, మండల కన్వీనర్లు కప్పలబండ మధుసూదన్ రెడ్డి, గంగరాజు, మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా, మాజీ జెడ్పిటిసి ప్రవీణ్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్, సీవీ రంగారెడ్డి, రంగస్వామి, 15వ వార్డు సునీల్, సుధీర్ రెడ్డి, వరదరాజులు, రమణ, రోప్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.








