contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

YSRCP పాలకవర్గ సభ్యులకు ఘన సన్మానం

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తి అయి నేటితో ముగియనున్న సందర్భంగా కౌన్సిలర్లను గౌరవిస్తూ గుత్తి మున్సిపల్ కార్యాలయంలో గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ శాసన సభ్యులు వై.వెంకటరామి రెడ్డి గారి ఆదేశాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ల సమావేశాన్ని ఏర్పాటు చేసి శాలువా కప్పి సన్మానించారు.అనంతరం వైయస్సార్సీపి జిల్లా నాయకుడు CB. మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి నడుస్తూ ఎన్నికల సమయంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన మీలో ఏ ఒక్కరు ప్రలోభాలకు లోను కాకుండా అంకితభావంతో పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతాల కోసం జగన్ గ పైన మరియు వై. వెంకటరామి రెడ్డి పైన నమ్మకంతో నిలబడినందుకు మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు  తెలియజేస్తున్నానని తెలిపారు. పదవి కాలం పూర్తయింది అన్న నిరుత్సాహంతో లేకుండా రేపటి నుంచి మరింత ఉత్సాహంతో ప్రజల్లో ఉండాలని రానున్న రోజులు మనవేనని. గుత్తి మున్సిపాలిటీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేస్తామని, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వై. వెంకటరామి రెడ్డి
జండా ఎగిరేస్తామని భరోసా కల్పించారు.రానున్న రోజుల్లో మరిన్ని సమస్యల పైన పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలిస్తే మీ అందరికీ మంచి రోజులు ఉంటాయని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ లు,మున్సిపల్ కౌన్సిలర్లు,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :