- పలు కాలనీల్లో సైడ్ కాలువలలో మురికి నీరు సమస్యను పరిశీలించిన గుంతకల్ ఏమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో పలు కాలనీల్లో సైడ్ కాలువలలో మురికి నీరు రోడ్లపైకి చేరి పాదాచారులకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో సమాచారం తెలుసుకున్న గుంతకల్ శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ 9,12 సచివాలయాల ఆధ్వర్యంలో గల బీసీ కాలనీ తాడిపత్రి రోడ్డు ప్రాంతము స్వయానా పరిశీలించి కాలనీలో ఉన్న ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కళ్యాణి పాటిల్ సురేష్ ఎం కె చౌదరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










