POLITICS TELANGANA

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో హ‌రీశ్ రావు భేటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో టీఆర్ఎస్ కీల‌క నేత‌, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు బుధ‌వారం భేటీ అయ్యారు. జీఎస్డీ కౌన్సిల్ స‌మావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం బుధ‌వారం ఢిల్లీకి వెళ్లిన హరీశ్ రావు మ‌ర్యాద‌పూర్వ‌కంగానే సీతారామ‌న్‌తో భేటీ అయిన‌ట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణ‌కు చెందిన అంశాలేమీ కూడా ప్ర‌స్తావ‌న‌కు రాలేద‌ని స‌మాచారం. కేంద్ర ప్ర‌భుత్వానికి ప‌న్నుల రూప‌పేణా తెలంగాణ చెల్లించిన మొత్తం.. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ‌కు కేంద్రం […]

ANDHRA PRADESH

సొంత పార్టీ నేతలకు బాలినేని హెచ్చరిక

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోమారు ఫైరయ్యారు. వైసీపీలోని కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించిన బాలినేని తాజాగా వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను తింటున్నది కూడా ఉప్పూ కారమేనని, ఇకపై వారు పద్ధతి మార్చుకోకుంటే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. నిన్న జరిగిన ఒంగోలు పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్, మునిసిపల్ మాజీ […]

ANDHRA PRADESH

సీఎం జగన్, శ్రీలక్ష్మిలపై ఛార్జ్ షీట్లు ఉన్నాయి : ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

మరోసారి తనని సస్పెండ్ చేయడంపై ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. తనపై ఒక్క ఛార్జ్ షీట్ కూడా లేదని ఆయన అన్నారు. తన సంతకాలను ఫోర్జరీ చేశారని… దీనిపై సీఎస్ కు మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మీద 12 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయని… ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసులు, ఛార్జ్ షీట్లు ఉన్నాయని… వీరికి వర్తించనివి తనకెలా […]

TECHNOLOGY WORLD

‘స్కై క్రూయిజ్’ … ప్రపంచమంతా తిరుగుతూ ఎంజాయ్​ చేయొచ్చు!

క్రూయిజ్ షిప్ తరహాలో వందల క్యాబిన్లు.. అందులోనే సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, గేమింగ్ జోన్లు, షాపింగ్ సౌకర్యాలు.. అద్దాలతో కూడిన బాల్కనీలు.. అబ్బో అనిపించేలా సౌకర్యాలు.. మరి ఇవన్నీ ఉండేది ఓ విమానంలో అయితే.. భలే చిత్రంగా ఉంది కదా. యెమెన్ కు చెందిన ప్రమేఖ సైన్స్ ఇంజనీర్ హషీమ్ అల్ ఘాయిలీ దీనిని డిజైన్ చేశారు. దీనికి సంబంధించి ఓ గ్రాఫిక్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో నెటిజన్లను విపరీతంగా […]

ANDHRA PRADESH

ఆంధ్రప్రదేశ్ లో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు .. కిడారి, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నట్టు సమాచారం

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలో పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా.. మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు. లొంగిపోయిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సోమ హత్య కేసు నిందితులు కూడా ఉన్నట్టు సమాచారం. కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన మావోలు లొంగిపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు […]

ANDHRA PRADESH POLITICS

ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా బీజేపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా, కర్రలు, రాడ్లతో వచ్చిన వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడికి పాల్పడడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. బీజేపీ నేతలపై నేడు ధర్మవరం ప్రెస్ క్లబ్ లో దాడి జరిగిందని తెలిపారు. పట్టపగలు… పాత్రికేయుల సమావేశం జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాగా, ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని […]

TELANGANA

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టు లో చుక్కెదురు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ చేసుకున్న విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నేడు తోసిపుచ్చింది. అసలేం జరిగిందంటే… కొప్పుల ఈశ్వర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ పోటీ చేశారు. ఇందులో కొప్పుల ఈశ్వర్ విజేతగా […]

BHAKTHI TELANGANA

ఖైర‌తాబాద్‌లో ఈ సారి 50 అడుగుల మ‌ట్టి వినాయ‌కుడు

ఈ ఏడాది ఖైర‌తాబాద్‌లో ఆవిష్కరించ‌నున్న గ‌ణేశుడి ప్ర‌తిమ‌కు సంబంధించిన న‌మూనాను ఖైత‌రాబాద్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ సోమ‌వారం విడుద‌ల చేసింది. ఈ ద‌ఫా 50 అడుగుల ఎత్తుతో రూపొందించ‌నున్న ఖైర‌తాబాద్ వినాయ‌కుడు పూర్తిగా మ‌ట్టితోనే నిర్మితం కానున్నాడు. ఇప్ప‌టిదాకా ఏర్పాటైన వినాయ‌క ప్ర‌తిమ‌ల‌న్నీ ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో రూపొందిన‌వే. అయితే తొలిసారి ఖైర‌తాబాద్ గ‌ణేశుడు పూర్తిగా మ‌ట్టితోనే రూపొంద‌నున్నాడు. మ‌ట్టి గ‌ణప‌తుల వినియోగాన్ని ప్రోత్స‌హించాల‌న్న ప్ర‌భుత్వ పిలుపుతోనే ఈ ద‌ఫా మ‌ట్టి వినాయ‌కుడి ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు […]

ANDHRA PRADESH POLITICS

సొంత పార్టీ వాళ్లే వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నారు : వైసీపీ కీల‌క నేత బాలినేని

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో కీల‌క నేత‌, పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌మీప బంధువుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి త‌న సొంత పార్టీ నేత‌ల‌పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై సొంత పార్టీ వాళ్లే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న సోమ‌వారం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అలా సొంత పార్టీలో ఉంటూనే త‌న‌పై కుట్ర‌లు చేస్తున్న వారెవ‌రో త‌న‌కు తెలుసున‌ని చెప్పిన […]

TELANGANA

ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించాలి …. తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

ప్ర‌భుత్వం తమ ఉపాధ్యాయుల‌కు సంబంధించి శ‌నివారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై ఏటా త‌మ ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా స్థిర‌, చ‌రాస్తుల‌కు సంబంధించి క్ర‌య విక్ర‌యాల కోసం ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకోవాల‌ని కూడా ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ మేర‌కు శ‌నివారం పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.