AP NEWS

హలో.. మాదిగ.. చలో ఢిల్లీ – కారంపూడి MRPS నాయకులు

గుంటూరు జిల్లా కారంపూడి : ప్రస్తుత జరగబోవు పార్లమెంట్ సమావేశాల్లో యస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి బిజెపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు డిసెంబర్ 5 న జరుగు మాదిగల మహాగర్జన జయప్రదం చేయాలనీ కారంపూడి మండలంలో అధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని మండల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గడిపర్తి శ్రీనివాస రావు ,మామిడి శేఖర్ , కందుకూరి రమేష్ , లంక యిర్మీయా , తల్లపోగు అచ్చుత […]

AP NEWS

కారంపూడి మండలంలో వరస దొంగతనాలు – రంగంలోకి దిగిని క్లూస్ టీమ్

గుంటూరు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో అర్థరాత్రి సమయంలో వరుస దొంగతనాలు జరిగాయి. రెండు గృహాలు , ఒక ఫర్టిలైజర్ షాప్ , పోస్ట్ ఆఫీస్ తాళాలు పగులగొట్టినట్టు పోలీసువారి సమాచారం. గురజాల సిఐ బి కోటేశ్వర రావు , కారంపూడి ఎస్సై , సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గుంటూరు నుండి క్లూస్ టీమ్ వస్తున్నారని వారు వచ్చినతరువాత దర్యాప్తు జరిపి పూర్తీ వివరాలు వెల్లడిస్తామని సిఐ కోటేశ్వర రావు తెలిపారు.

AP NEWS

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు!

ఏపీ ప్రభుత్వం కీలక పదవులను వరుసగా భర్తీ చేస్తోంది. తాజాగా, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత్రికేయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న దేవిరెడ్డి శ్రీనాథ్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా పేరొందారు. 70వ దశకం చివరల్లో జర్నలిజం వృత్తిలో ప్రవేశించిన శ్రీనాథ్ ఆంధ్రప్రభ పత్రికతో ప్రస్థానం మొదలుపెట్టారు. అంతర్జాతీయంగా పేరొందిన బీబీసీ రేడియోకు కూడా ఆయన సేవలందించారు. ఏపీయూడబ్ల్యూజే కడప జిల్లా ప్రెసిడెంట్ […]

AP NEWS

పోలవరం పనులకు బ్రేక్ వేసిన హైకోర్టు – పనులు ఆపేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశం

పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులకు మరోసారి అడ్డుకట్ట పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను ఈరోజు విచారించిన హైకోర్టు… ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ, పనులు నిలిచిపోతే అన్ని విధాలుగా నష్టం వాటిల్లుతుందని కోర్టుకు విన్నవించారు. వరదలు మళ్లీ […]

AP NEWS

3.70 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు పంపిణీ మొదలు… డబ్బులు పడ్డాయని మొబైల్ చూపుతూ బాధితుడి ఆనందం!

అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల కన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారికి డబ్బుల పంపిణీ ఈ ఉదయం మొదలైంది. సీఎం వైఎస్ జగన్ ఒక్క క్లిక్ తో 3.70 లక్షల మంది ఖాతాల్లోకి మొత్తం రూ. 264 కోట్లను బదలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు హాజరైన ఆయన ఆన్ లైన్ విధానంలో డబ్బు బట్వాడా చేశారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం […]

AP NEWS

ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతి

వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతికి ఏపీ సర్కారు కీలక పదవి అప్పగించింది. లక్ష్మీపార్వతిని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీపార్వతి ఈ పదవికి న్యాయం చేస్తారని భావిస్తున్నారు. లక్ష్మీపార్వతి వైసీపీలో చేరిన తర్వాత సమయానుకూలంగా తన గళం వినిపిస్తూ పార్టీ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కినట్టు తెలుస్తోంది.

AP NEWS

జగన్ ఇంటి కిటికీలకు రూ.73 లక్షలా? నెలకు రూపాయి జీతమని ఎంత మోసం చేస్తున్నారంటూ నారా లోకేశ్ వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్మీ నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానని చెబుతున్న సీఎం జగన్, తన ఇంటి కిటికీల కోసం రూ.73 లక్షల మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి పొందడం ఎంత మోసం! అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. “సరిగా వినండి, నేను మళ్లీ ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నాను. జగన్ నివాసంలో కిటికీల ఏర్పాటుకు రూ.73 లక్షలు కేటాయించారు. అన్ […]

AP NEWS

రాజధానిని పులివెందులకు మార్చండి, కర్నూలులో హైకోర్టు :సీఎం జగన్ పై పవన్ వ్యాఖ్యలు

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తన విమర్శల దాడికి మరింత పదునుపెట్టారు. ఇప్పటివరకు వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన పవన్ ఈసారి సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే, పులివెందుల నుంచి కర్నూలు వెళ్లిరావడం ఎంతో సులభం అని, అందుకే రాజధానిని పులివెందులకు మార్చుకోవాలని సెటైర్ వేశారు. తద్వారా సీఎం జగన్ కు ఖర్చు కూడా మరింత ఆదా అవుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. విశాఖలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో […]

AP NEWS

ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని .. మొదటి స్థానంలో ఉన్న ప్రీతికి దక్కని అవకాశం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరన్న చర్చకు సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది. ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని కొత్త సీఎస్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. సాహ్ని ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి సోమవారం మధ్యాహ్నం అమరావతి వచ్చిన సాహ్ని.. […]

AP NEWS

కలుషితమైన నీరు – ప్రజల ప్రాణాలతో చెలగాటం

అనంతపురం : బుక్కరాయసముద్రం మండలంలోని వివిధ గ్రామాలలో త్రాగునీరు కలుషితమై డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాల బారిన పడి తీవ్ర అనారోగ్యాల తో బాధ పడుతున్న కారణంగా అధికారులు వెంటనే స్పందించి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామాలలో పరిశుభ్రమైన మంచినీరు అందించాలని ప్రతి గ్రామంలోనూ ఫాగింగ్ చేయించి నిలిచి ఉన్న నీటిలో బ్లీచింగ్ చేయించాలని దోమల నివారణ చేసి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు […]