AP NEWS

రాజధాని పై స్పష్టత ఇవ్వకుంటే ధర్నాకు సిద్ధం – రైతుల హెచ్చెరిక

రాజధానిపై డిసెంబరు 9 లోగా స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పష్టమైన ప్రకటన చేయకుంటే అసెంబ్లీ వద్ద నిరాహార దీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు. ఆర్థికమంత్రి ప్రకటనతో ఆందోళనకు గురయ్యామని తెలిపారు. రాజధానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. కాగా, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్య అంశం కాదని, లక్షల కోట్లు నిర్మించి లండన్ తరహా రాజధాని నిర్మించడం తమ ప్రభుత్వ స్తోమతకు తగని పని […]

BHAKTHI

శనివారం రోజున హనుమ ఆరాధన ఫలితం …!

ఆపదలో వున్న తన భక్తులను ఆదుకోవడానికి హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. అలాంటి హనుమంతుడిని అనునిత్యం పూజించేవారు వుంటారు .. ఆ స్వామికి ప్రదక్షిణలు చేసిన తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను మొదలుపెట్టేవారు వుంటారు. ఇక స్వామివారికి ప్రత్యేకించి పూజాభిషేకాలు చేయించేవారు మాత్రం, హనుమకు ఇష్టమైన మంగళవారం రోజున అవి చేయిస్తుంటారు. తమలపాకులతో పూజలు చేయించి .. ఆ స్వామికి ఇష్టమైన తీపి అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన అనారోగ్యాలు .. […]

BHAKTHI

శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన ఎవరో తెలుసా ? ఆయన శక్తి ?

ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే విగ్రహం భైరవుడు. భయాన్ని కలిగించేలా ఆయన రూపం వుంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా కనిపిస్తుంటాడు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో … వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ […]

AP NEWS

ఇచ్చినమాట కు కట్టుబడిన జగన్ – మత్స్యకారులకు శుభవార్త

తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జగన్.. పశువుల్లంక-సలాదివారిపాలెం వంతెనను ప్రారంభించారు. అలాగే, కొమానపల్లిలో టూరిజం కంట్రోల్ గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా ఇక్కడి మత్య్సకారులు అప్పట్లో బతుకుదెరువు కోసం వలసలు వెళ్లారు. గంగ పుత్రుల జీవితాలు మార్చే నిర్ణయాలు తీసుకున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఓ ప్రకటన చేయడానికి ఇక్కడకు వచ్చాను. ఆదాయం కోల్పోయిన ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి తోడుగా ఉంటానని […]

AP NEWS

జెసి అనుచరుడు వైసిపి లోకి జంప్ – 500 మందితో చేరిక

జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలకు ఎన్నో ఏళ్లుగా ముఖ్య అనుచరుడిగా ఉన్న షబ్బీర్ అలీ అలియాస్ గోరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేడు గోరాతో పాటు దాదాపు 500 మంది తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరిలో లారీల యజమానులు, పలువురు జేసీ అనుచరులు కూడా ఉన్నారు. వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించిన పెద్దారెడ్డి, ముఖ్య నేతలకు వైసీపీ కండువాలు కప్పారు.

AP NEWS

పార్లమెంట్ లో ఇంగ్లీష్ మీడియంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆగ్రహం?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ లో ఎంపీ చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఇన్ ఛార్జీ వైవీ సుబ్బారెడ్డితో సీఎం చర్చించారు. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా రఘురామ కృష్ణంరాజు  మాట్లాడటంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని జగన్ అన్నట్లు తెలుస్తోంది.

AP NEWS

గుంటూరులో వ్యభిచార దుకాణం గుట్టురట్టు – నిర్వాహకులు సహా ఆరుగురి అరెస్ట్

కాలేజీ పక్కనే దుకాణం తెరిచిన వ్యభిచార ముఠా గుట్టును గుంటూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు. చినకాకాని ప్రాంతంలో ప్రైవేటు కళాశాలల హాస్టళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం విద్యార్థులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఓ వ్యభిచార ముఠా ఇక్కడ దందా ప్రారంభించింది. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు విటులు, నలుగురు నిర్వాహకులు ఉన్నారు. వారి వద్ద నుంచి […]

AP NEWS

కొడాలి నాని పై కేసు నమోదు చేయాలనీ తిరుపతి పోలీసులకు బిజెపి ఫిర్యాదు

ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నేతలు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ, ‘తిరుమల ఆలయాన్ని మీ అమ్మ మొగుడు కట్టాడా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారంటూ మండిపడ్డారు.  మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కొడాలి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  నానిపై కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళతామని తెలిపారు […]

AP NEWS

గంటా ఆస్తులు వేలం – డిసెంబరు 20న ఆస్తుల వేలం

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిక్కుల్లో పడ్డారు. గంటా పార్టీ మారుతున్నట్టు కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే, ఆయనకు సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇండియన్ బ్యాంక్ నుంచి గంటా ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రూ.209 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ అప్పు నిమిత్తం రూ.35 కోట్ల విలువైన ఆస్తులు తనఖా పెట్టినా మిగిలిన బకాయిల కోసం బ్యాంకు గంటా ఆస్తుల వేలానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రికవరీ […]

AP NEWS

హిందువుల సొమ్ము ను క్రిస్టియన్లకు , ముస్లింలకు దోచిపెడుతుంది జగన్ ప్రభుత్వం :స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఫైర్

శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సాధుపరిషత్ హిందూ సమ్మేళనంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలువురు హిందూ స్వామీజీలు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఏపీ సాధుపరిషత్ హిందూ సమ్మేళనానికి పలువురు స్వామీజీలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, హిందువులు కష్టపడి చెల్లిస్తున్న కోట్లాది రూపాయల పన్నుల నుంచి వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు, ఇమామ్ లకు నెలకు రూ. 5 వేలు దోచిపెట్టేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. హిందువుల […]