NATIONAL

సూడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం…23 మంది దుర్మరణం

ఆఫ్రికా దేశం సూడాన్ లోని ఓ కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని ఖార్తూమ్, పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ప్రమాదం చోటుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కర్మాగారంలో దాదాపు 50 మంది భారతీయులు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ, మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని వెల్లడించింది. ప్రమాదం జరిగిన […]

TELANGANA

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ – సీపీ సజ్జనార్ పాత్రధారి కావచ్చు : మందకృష్ణ మాదిగ

దిశ అత్యాచార ఘటనలో నిందితులది ఎన్ కౌంటర్ కాదు సామూహిక హత్యాకాండ అని ఆరోపించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ, సీపీ సజ్జనార్ పై విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేరు కేంద్ర బిందువుగా మారిందని, ‘సజ్జనార్ పాత్రధారి కావచ్చు.. సూత్రధారి కాదుగా. సూత్రధారుల ఆలోచనకు అనుగుణంగా పాత్ర పోషించినోడు సజ్జనార్ కావచ్చు. ఆయన ఒక్కడే తీసుకున్న నిర్ణయమైతే కాదు.. […]

TELANGANA

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాద – యువకుడికి తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్డుపై ఆదివారం మధ్యాహ్నం బల్లార్ష కు చెందిన MH 34 BG 5850నంబరు గల బొలేరో ట్రాలీ కరీంనగర్ వైపు అతి వేగంగా వెళ్తున్న సమయంలో TS 02 ED 9334 నంబరు గల రాంగ్ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అశోక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు టోల్ ప్లాజాకు సమాచారం ఇవ్వగా ఆంబులెన్స్ లో అతనిని ఆస్పత్రికి తరలించారు కాగా ద్విచక్ర […]

TELANGANA

ప్రాణం తీసిన ఈత సరదా . . . పెళ్లి ఇంట్లో విషాదం! !

*పెళ్లి రిసెప్షన్ రోజు ఈతకు వెళ్ళి తమ్ముడు మృతి. . . *గుండెలు ఆవిసేలా రోదించిన కుటుంబ సభ్యులు. . ఈత సరదాలు ప్రాణాలు తిస్తున్నాయి . . పచ్చని తోరణాలతో,బందువులు రాకతో కళకళలాడుతున్న ఆ పెళ్లి ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది.సోదరి వివాహానికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లిన నలుగురిలో ఒకరు మృతి చెందిన సంఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది…. వివారాల్లోకి వెళితే సైదాపూర్ ఎస్ఐ ప్రశాంత్ రావు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ […]

TELANGANA

టిఆర్ఎస్ మానకొండూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా గూడూరి సురేష్ నియామకం

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన గూడూరి సురేష్ ను నియమిస్తూ ఉత్తర్వులు పత్రాన్ని తిమ్మాపూర్ ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణంలో అందజేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్,గూడూరి సురేష్ మాట్లాడుతూ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ యువజన విభాగం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు తన నియామకానికి కృషిచేసిన శాసనసభ్యులు రసమయి బాలకిషన్,రాష్ట్ర నాయకులు తన్నీరు శరత్ రావు, […]

TELANGANA

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ ప్రారంభించిన సభ్యులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డైరెక్టర్ల ప్రత్యేక సమావేశంలో లయన్ డాక్టర్ విజయ రేకులపల్లి డిస్టిక్ గవర్నర్ పాల్గొని సమావేశాన్ని ప్రారంభించారు ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ భవన నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు తన వంతు 10116 విరాళంగా ఇచ్చారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి 10116 వెంకటరమణ విరాళంగా ఇచ్చారు రీజియన్ చైర్మన్ వెంకట రమణ 10116 విరాళంగా భవనానికి నిర్మాణం కోసం ఇచ్చారు […]

TELANGANA

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలి :గూడూరి సురేష్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో మానకొండూర్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులుగా గూడూరి సురేష్ ప్రెస్ మీట్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి శాసనసభ్యులు రసమయి బాలకిషన్ తోనే సాధ్యమని ,రానున్న రోజుల్లో అభివృద్ధిలో మరింత ముందుకు సాగుతుందని అన్ని వర్గాల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క యువజన సభ్యుడు ప్రతి గ్రామంలో అమలయ్యే అనేక సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే టిఆర్ఎస్ […]

NATIONAL

కూలి డబ్బులు అడిగినందుకు జేసీబీతో తొక్కించి చంపేశాడు

కష్టపడి పనిచేశాను..నా కూలి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగిన పాపానికి జేసీబీతో తొక్కించి అంత్యం దారుణంగా చంపేసిన ఘటన యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణంగా స్థానికంగా కలకలం సృష్టించింది.రాణీగంజ్ కైథెలా గ్రామానికి చెందిన శ్రీనాథ్ సరోజ్ కుమారుడు విపిన్ సరోజ్ అనే 18 సంవత్సరాల యువకుడు అదే ప్రాంతంలో ఉంటున్న వికాస్‌సింగ్‌కు చెందిన జేసీబీని డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పని చేసిన తరువాత యజమాని వికాస్‌సింగ్‌ […]

TELANGANA

చిన్నపిల్లలు రేపులు చేసినోళ్లను జైల్లో పెట్టి పందులను మేపుతున్నట్టు మేపుతున్నారు : చెన్నకేశవులు భార్య ధర్నా

TELANGANA

ఎన్కౌంటర్ కి పెరిగిన క్రేజ్ – శ్రీనివాసరెడ్డినీ చంపేయాలంటున్న హాజీపూర్ వాసులు

దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబీకులకు ఊరటనిచ్చి ఉండవచ్చు. అదే సమయంలో పలు బాధిత కుటుంబాల నుంచి ఇటువంటి డిమాండ్ రావడం మానవతావాదులను ఆశ్చర్యపరుస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని తెలిసినా బాధిత కుటుంబాలు దాన్నే ఒప్పుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే అయేషా మీరా తల్లి, ఆ తర్వాత సినీనటి ప్రత్యూష తల్లి తమకు జరిగిన అన్యాయంపై న్యాయం ఎప్పటికని ప్రశ్నించారు. వరంగల్ లో పందొమ్మిదేళ్ల బాలికను పుట్టినరోజునాడే […]