విజయనగరం జిల్లా, బాడంగి: బాడంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష ద రిపోర్టర్ టీవీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం 16 నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికల కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇంజక్షన్లను సరఫరా చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ టీకా తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్) ముప్పు నుంచి ముందస్తుగా రక్షణ పొందవచ్చని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని డాక్టర్ ప్రత్యూష సూచించారు.
తల్లిదండ్రులు కూడా అవగాహన పెంపొందించుకుని తమ కుమార్తెల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని వైద్యులు కోరారు.








