కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కరీంనగర్ కు విచ్చేసిన సందర్భంగా వారిని గన్నేరువరం బ్రిడ్జి జేఏసీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గన్నేరువరం మండల అభివృద్ధి కోసం గన్నేరువరం మండల కేంద్రానికి మానేరు వాగుపై సాధ్యమైనంత తొందరగా బ్రిడ్జి సర్వే నిర్వహించి, బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంపతి ఉదయ్ కుమార్, పుల్లెల జగన్ మోహన్, పుల్లెల రాము, బామండ్ల రవీందర్, సోమిరెడ్డి రఘునాథ్ రెడ్డి, కటుకం తిరుపతి, కాంతాల కృష్ణారెడ్డి కొలుపుల వేణు, ఘర్షకుర్తి ప్రవీణ్,పుల్లెల నరేందర్,గుండ వెంకటేష్,ఘర్షకుర్తి రామకృష్ణ, గువ్వల పోచయ్య,మామిడి పల్లి లక్ష్మణ్,ర్యాకం అంజన్న, మామిడిపల్లి హనుమయ్య, మండల ప్రజలు పాల్గొన్నారు.
