కరీంనగర్ జిల్లా: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరి సంపత్ కుమార్ ని రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ నియమించినట్లు ఓ ప్రకటన లో తెలిపారు.. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరి సంపత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట కమిటీలు నియమించి 33 జిల్లాలో ఉన్నటువంటి బీసీల, సమస్యలపై పోరాడుతామని త్వరలో పూర్తి మండల మరియు గ్రామ కమిటీ లు కూడా నియమిస్తామని అన్నారు.తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ కి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ కి బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పెంట అజయ్ పటేల్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిగంటి అశ్విన్,లకు బీసీ సంఘం నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
