సిద్దిపేటజిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూర్ గ్రామానికి చెందిన దళిత రత్న బిరుదాంకితుడు రాసురి మల్లికార్జున్ ను గురువారం రోజు మనకొండూర్ మాజీ ఎమ్మెల్యే అరేపెల్లి మోహన్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరానికి గాను మల్లికార్జున్ సేవలు గుర్తించి అవార్డ్ తో గౌరవిచడం ఎంతో సంతోషదాయకం ఎందుకంటే మల్లికార్జున్ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలుగోని ,దళిత జాతి ఎదుర్కొంటున్నా అనేక సమస్యల పై అలుపెరగని పోరాటం చేస్తు, దళితులను సంఘటితం చేస్తు చైతన్య పర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వడ్లూర్ మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, తోటపెళ్లి మాజీ సర్పంచ్ కనకయ్య,అన్నాడి రవీందర్ రెడ్డి,ప్యాక్స్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, పులి రమేష్,కుక్కల ఎల్లయ్య,రాములు,మంకలి ప్రవీణ్, చంటి,వెంకటేష్ ,వివిద కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
