సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం మానకొండూరు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర సంస్కృతిక చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ 20 లక్షల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం చేపట్టిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 67 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధి పనులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారని పేర్కొన్నారు.రానున్న ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నిన రాష్ట్ర ప్రజలు మళ్లీ బిఆర్ఎస్ పార్టీకే అధికారం కట్టబెట్టి మరిన్ని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక కస్తూరిబా గాంధీ పాఠశాల ఆవరణలో విద్యార్థినిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, జడ్పిటిసి కనగండ్ల కవిత తిరుపతి, సర్పంచ్ దేవనపెల్లి మంజుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ బండి వేణు, స్థానిక ఎంపీటీసీ గుబురే శారద మల్లేశం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు చంద్రకళ రాజయ్య, ఎంపీడీవో దమ్మాని రాము, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, నాయకులు బిగుళ్ల మోహన్, బిగుళ్ల సుదర్శన్, మేకల శ్రీకాంత్, వంగ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
