తూగో జిల్లా రాజనగరం : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో కలకలం… క్లాస్ రూంలోనే విద్యార్థులు కత్తులతో పొడుచుకున్న ఘటన ఆందోళనకు గురిచేసింది. క్లాస్ రూంలో ఎగ్జామ్ రాస్తుండగా 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. టీచర్ ముందే కత్తులతో దాడి చేసుకున్నారు. సాయి అనే విద్యార్థిని మరో విద్యార్థి శంకర్ చాకుతో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ప్రధానోపాధ్యాయుడు హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఘర్షణకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
