కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: బిఆర్ఎస్ పార్టీ నాయకులు వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో మాజీ ఎంపీ.
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
మండల అధ్యక్షుడు గంప వెంకన్న పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ గొల్లపల్లి రవి, సర్పంచులు కుమ్మరి సంపత్, నక్క మల్లయ్య,మధుకర్,పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొట్టే భూమయ్య,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నక్క దామోదర్, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూన చంద్రశేఖర్, గొల్ల కురుమ యాదవ సంఘం మండల అధ్యక్షుడు సందవేని ప్రశాంత్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల ప్రభాకర్, బోయిని బాలయ్య,మహంకాళి ప్రభాకర్,ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తి అంజి, నాయకులు అట్టికం రవి, సందవేని రాములు,టేకు అనిల్,బొజ్జ శ్రీకాంత్, సమ్మెట అనిల్,ఈదయ్య,రాజయ్య, బొడ్డు శీను,మఠం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
