మాసాయిపేట (తూప్రాన్ డివిజన్) : Bharatiya Janata Party ఆవిర్భావ దినోత్సవాన్ని మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమాలు చేపట్టారు.
సీనియర్ నాయకుడు వంటేరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి బీజేపీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై పార్టీ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు పాపన్న గారి శ్రీకాంత్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు కేతావత్ లింగం నాయక్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు వదునల నగేష్ యాదవ్, యువ మోర్చా మండల అధ్యక్షుడు గోల్కొండ విట్టల్, పోతంశెట్టిపల్లి సర్పంచ్ ఉప్పల ప్రశాంత్, హకీంపేట ఉపసర్పంచ్ వెంకటేశం చారి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా బూత్ అధ్యక్షులు మల్లాపురం సాయి, పల్లపు సురేష్, పల్లపు అశోక్, గౌరగల రాములు, నాగసాన్పల్లి బూత్ అధ్యక్షుడు రవి, పోతాన్పల్లి బూత్ అధ్యక్షుడు గుల్ల నరేష్, సత్యనారాయణతో పాటు సీనియర్ నాయకులు సుంచనకోట శ్రీకాంత్ గౌడ్, ముక్క యాదగిరి, వడ్ల పరశురామ్ చారి, తుడుం సాయిలు మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









