కరీంనగర్ జిల్లా: పార్లమెంటు సభ్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ లోని కలెక్టరేట్ ఎదుట బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అకాల వర్షం వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది, వరి మిర్చి మామిడి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ,,50,000 వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేసినారు, తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
