కరీంనగర్ జిల్లా: సైదాపూర్ విద్యార్థులు భయం వీడితే జయం మీదే అవుతుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బొట్ల రామస్వామి విద్యార్థులకు సూచించారు. మండలంలోని గొడిశాల ఉన్నత పాఠశాలలో గొడిశాల అమ్మన గుర్తి రాయికల్ బొమ్మకల్ ఉన్నత పాఠశాలల వెంకేపల్లి ఉన్నత పాఠశాలలో వెంకేపల్లి ఆకునూర్ పెర్కపల్లి ఎక్లాస్ పూర్,వెన్నంపల్లి పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు ఎలా సాధించవచ్చు అనే అంశంపై మండల స్థాయి ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొట్ల రామస్వామి మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా చదివితే పదవ తరగతిలో 10 జీపీఏ సాధించవచ్చునని అన్నారు. పరీక్షలు అంటే విద్యార్థులు భయపడవద్దని అన్నారు. ప్రతి విద్యార్థిలో విజయానికి అవసరమైన శక్తి ఉంటుంది కానీ చాలామంది విద్యార్థులు తమలో ఉన్న శక్తిని గుర్తించకపోవడంతో అపజయం పాలవుతున్నారని అన్నారు. ఏ విద్యార్థి కూడా చదువు రాకుండా ఉండడు చదవక పోవడం వలనే చదువు రాదన్న అనుమానంతో ఫెయిలవుతున్నారని అన్నారు. విద్యార్థుల్లోని అంతర్గత శక్తిని వెలికితీయడానికి విద్యార్థులచే జీరో గేమ్ ఆడించి వాళ్ళలో శక్తి ఉందని నమ్మకం కలిగించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడే తత్వాన్ని విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బొట్ల రామస్వామి నీ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి, దేవేందర్ రెడ్డి, దొంత శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, మారుతి, ఉపాధ్యాయులు తెలుకుంట్ల స్వర్ణలత,దుంపల సరిత తదితరులు పాల్గొన్నారు.
