కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలోని సోమవారం అర్ధరాత్రి రాజీవ్ రహదారిపై బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి ముగ్గురు చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇసుక పనికి వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎల్ఎండీ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని, గాయపడ్డ వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు, మూడు నెలలుగా ఇసుక రవాణా నడుస్తున్న అటు ఎల్ ఎండీ పోలీసులు, ఇటు రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే తరుచూ ప్రమాదాలు జరుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలానే ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగాయనీ, పలువురు తెలిపారు.
