కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల వ్యాప్తంగా ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను 16 గ్రామాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు, బిఆర్ఎస్ పార్టీ జెండాను వివిధ గ్రామల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మీసాల ప్రభాకర్, మహంకాళి ప్రభాకర్, కర్నే చంద్రయ్య, బామండ్ల తిరుపతి, నూనె చంద్ర రెడ్డి, న్యాలపట్ల శంకర్ గౌడ్, అనిల్ గౌడ్, లు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి,ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్, చోక్కారావు పల్లె సర్పంచ్ ముస్కు కర్ణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు న్యాత సుధాకర్,ఏలేటి చంద్రారెడ్డి, గొల్లపల్లి రవి,బోయిని కుమార్, నక్క దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
