contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి స్పష్టమైన తీర్పు వెలువరించింది.

ఇంతకుముందు హరీశ్ రావు, రాధాకిషన్ రావులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సముచితమైనవేనని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

ఈ తీర్పుతో హరీశ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయిలో ఊరట లభించినట్టయింది. బీఆర్‌ఎస్ శ్రేణులు ఈ తీర్పును పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నాయి. రాజకీయ కక్షతోనే తమ నేతలపై కేసులు పెట్టారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో తమ వాదనకు బలం చేకూరిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు, ఈ తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :