సిద్దిపేట జిల్లా: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా చేపట్టిన దాడులను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా తీవ్రంగా ఖండిస్తోందనీ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు తెలిపారు.
మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా సామ్రాజ్యవాద శక్తులు వ్యవహరించడం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది.
ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఈ దాడుల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. సమస్యలను సైనిక దాడుల ద్వారా కాకుండా దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను ఐక్యరాజ్యసమితి తక్షణమే ఖండించి జోక్యం చేసుకోవాలి. భారత ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరి తీసుకుని శాంతి పరిరక్షణకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం
శాంతి, సౌహార్దం, ప్రజల జీవన హక్కుల కోసం పోరాడే శక్తులన్నీ ఈ దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని పిలుపునిస్తున్నాం.








