కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ ను, రైతులను అవహేళన చేసే విధంగా మాట్లాడిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాఖ్యలను నిరసిస్తూ గన్నేరువరం మండలకేంద్రలోని స్థానిక విధ్యుత్ ఉపకేంద్రం ముందు భారాస మండల శాఖ అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఉరి తీసి అనంతరం దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న – సుధాకర్, రైతుబంధు మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, గన్నేరువరం ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్,సింగిల్ విండో డైరెక్టర్ గొల్లపెల్లి రవి, బోయిని అంజయ్య, మానకొండూరు నియోజవర్గ యువజన సంఘాల అధ్యక్షుడు గూడూరి సురేష్, బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కూన చంద్రశేఖర్, గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల ప్రభాకర్, శ్రీలక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు నక్క దామోదర్, నాయకులు బుర్ర మల్లేశం గౌడ్,బోయిని కుమార్, శ్రీకాంత్,కొండల్ రెడ్డి, రాజయ్య, చంద్రయ్య,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
