కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం: హుస్నాబాద్ నియోజక వర్గ స్థాయిలో ఈ నెల 5న, జరిగే బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. శాసన సభ్యులు వొడితెల సతీష్ కుమార్ నేతృత్వములో ఐటి మరియు మున్సిపల్ శాఖా మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. ఈ సందర్బంగా రేకొండ గ్రామములో సన్నాహక సమావేశములో చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ మాట్లాడుతూ మండలం నుండి అన్ని గ్రామాల నుండి 10 వేల మంది తరలిరావాలన్నారు. మహిళలు,యువకులు, రైతులు అధిక సంఖ్యలో కదిలివచ్చి సభను విజయవంతం చేస్తూ మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచాలన్నారు.ఈ సన్నాహక సమావేశములో గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్లా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ పిట్టల రజిత, ఎంపిటిసి సభ్యురాలు కొత్తూరి సంధ్య నాయకులు నల్లాల రాజేందర్ రెడ్డి, అల్లెపు సంపత్, మైలారపూ చంద్రయ్య, చాడ వేణుమాధవ్ రెడ్డి, దొడ్ల విజయ, సంగెం శ్రీలత, గడ్డం అనిల్, మోర కొమురయ్య, పిట్టల అంబయ్య, తాటికొండ అభిషేకర్ రెడ్డి, పరిపాటి రవీందర్ రెడ్డి, కంప అశోక్, కలువల సంతోష్, అడేపు తిరుపతి, రొంటల శ్రీనివాస్ రెడ్డి, బిల్ల చంద్రా రెడ్డి, కొడముంజ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
