- భారీగా తరలి వచ్చిన తిమ్మాపూర్ మండల బీ.ఆర్.ఎస్.పార్టీ కుటుంబ సభ్యులు
- మరోసారి రసమయన్నకే పట్టం కడుతామంటూ ఆశీర్వదించిన ప్రజలు
కరీంనగర్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు బీ.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ సారధ్యంలో నిర్వహించిన తిమ్మాపూర్ మండల బీ.ఆర్.ఎస్.పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన వేడుకలు అంబరాన్నంటాయి, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, బీ.ఆర్.ఎస్. పార్టీ కరీంనగర్ జిల్లా ఇంఛార్జి.బసవరాజు సారయ్య మరియు బీ.ఆర్.ఎస్. పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్.జీవి. రామకృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు, బీ.ఆర్.ఎస్. పార్టీ శ్రేణులు బారీ సంఖ్యలో తరలి రాగా, కొత్తపల్లి స్టేజి వద్ద నుండి సాయిరాం గార్డెన్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిస్తూ బారీ ర్యాలీ కొనసాగింది, సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని అదేవిధంగా ఎమ్మెల్యే రసమయన్న ప్రతి నిత్యం ప్రజలకు సేవ చేస్తూ మానకొండూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేశారని ముచ్చటగా మూడవ సారి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నామంటూ ఆశీర్వదించారు..