- ఒక్కో ట్రాక్టర్ లోడ్ లో రెండు నుండి మూడు క్వింటాల్ల వడ్లు దోపిడీ.
- రైస్ మిల్లర్ లతో ఎమ్మెల్యే కుమ్ముక్కయ్యారు.
- వడ్లకు దొరకని లారీలు ఇసుక అక్రమ రవాణా కు ఎలా దొరుకుతున్నాయి ?
- బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం
కరీంనగర్ జిల్లా: రైతుల నుండి వేసవి కాలం వరి దాన్యం కొనుగోలు లో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. మంగళవారం గన్నేరువరం లో పార్టీ మండల కమిటీ సమావేశం అనంతరం మార్కెట్ యార్డ్ లో వడ్ల ను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. మొలకత్తిన తడిసిన దాన్యం ను పరిశీలించారు. ఒకపక్క వర్షాలు పడుతుంటే ఇంకా కళ్ళం నిండా వడ్ల బస్తాలు ఉన్నాయి అంటే రైతుల పట్ల స్థానిక ఎమ్మెల్యే బాలకిషన్ ఎంత నిర్లక్ష్యం గా ఉన్నాడో అర్ధమవుతుంది అని అన్నారు. మిల్లర్ల వద్ద నుండి గత వానకాలం ఇచ్చిన వడ్ల నుండి వచ్చిన బియ్యం ఇంకా ప్రభుత్వం తీసుకోలేదన్నారు. వడ్లు త్వరగా కొనకపోవడం ఒక పక్క, ఒక్కో ట్రాక్టర్ లోడ్ కి రెండు నుండి మూడు క్వింటల్లు వడ్లు మిల్లర్లు తీయడం మరోపక్క ఇలా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఒక్కో బస్తా మీద కనీసం ఐదు కిలోల వడ్లు దోచుకుంటున్నారు అని అన్నాడు. వడ్లను తరలించడానికి లారీ లు దొరకడం లేదు అని అధికారులు సమాధానం ఇస్తున్నారు. మరి ఇసుక ను తరలించడానికి లారీ లు ఎక్కడివని అయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మిల్లర్లతో కుమ్ముక్కు అయ్యాడు అని నిషాని ఆరోపించారు. లేకపోతే రైతుల కు జరుగుతున్న అన్యాయం ను ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎమ్మెల్యే వ్యవసాయ మార్కెట్ పదవులు అమ్ముకోవడం మీద పెట్టే ద్రుష్టి వ్యవసాయ రైతుల మీద పెడితే రైతులు బాగుపడతారని అన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఇంచార్జ్ లు ఏగోళ్ళ వెంకన్న గౌడ్, కుమ్మరి సంపత్, అసెంబ్లీ అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్, ఉపాధ్యక్షుల మాతంగి మల్లయ్య,ప్రధాన కార్యదర్శి రాజమల్లు, మండల అధ్యక్షులు బామాండ్ల ఎల్లయ్య, మహిళ కో కన్వినర్ ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.