contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

20 లక్షల విలువ చేసే ఫోన్లు రికవరీ చేసి అందజేసిన శ్రీకాకుళం పోలీసులు

శ్రీకాకుళం:  సుమారు 20లక్షల విలువ కల్గిన 150 మొబైల్ ఫోన్లు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ వెబ్ సైట్ లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఫోన్లు గుర్తించి, ఆయా రికవరీ చేసిన ఫోన్లు బాధితులకు జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. మొత్తం 150 ఫోన్లు బాధితులకు అందజేయగా, వీటి విలువ 18 నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితుల పోలీసు స్టేషన్లు కు వెళ్లే పనిలేకుండా జిల్లా ఐటి కోర్ టీమ్ రూపకల్పన చేసిన http://srikakulampolice.in/mobiletrackupload.html అధికార వెబ్ సైట్ లో తాము పోగొట్టుకున్న ఫోన్ యొక్క సమాచారాన్ని బాధితులు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఇలా ఫోన్ చోరీపై వివరాలు నమోదు చేయడంతో జిల్లా సైబర్ సెల్ సిబ్బంది 150 ఫోన్లును గుర్తించారు. ఈ మేరకు బాధితులు అందరిని శనివారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి అయా ఫోన్లును ఎస్పీ చేతులు మీదుగా అందజేసారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లో సెక్యూరిటీ లాకింగ్ లేకుండా ఎటువంటి విలువైన వ్యక్తిగత సమాచారాన్ని ఉంచరాదని సూచించారు. క్రెడిట్ కార్డు, ఏటీఎం పిన్ నెంబర్లు, నెట్ బ్యాంకింగ్ వంటి వాటికి భద్రత పరమైన లాకింగ్, యాప్ లాకింగ్, కోడ్ లేదా ప్యాట్రన్ లాకింగ్, ఫింగర్ ప్రింట్ లాక్ సిస్టమ్ లాంటివి ప్రతి ఒక్కరూ తప్పకుండా వాడాలని సూచించారు. మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు కొంతమంది తక్కువ ధరలకు ఇతరులకు అమ్మి వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇలా మన జిల్లా, రాష్ట్రం, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. కావున మొబైల్ ఫోన్లు పోనట్లయితే తక్షణమే శ్రీకాకుళం జిల్లా మొబైల్ లాస్ట్ ట్రాకింగ్ సిస్టం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా తక్కువ కాలంలోనే మీ ఫోన్లు రికవరి చేయడడానికి అవకాశం ఉందన్నారు.

గతంలో రూ.12.50 లక్షల విలువైన 130 మొబైల్ ఫోన్లను అందజేశామని, ఇప్పటివరకు 2 విడతల్లో కలిపి రూ.32,50,000లు విలువగల మొత్తం 280 ఫోన్లు బాధితులకు అందజేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మిగతా ఫోన్లు కూడా వీలైనంత త్వరగా రికవరీ చేసి బాధితులకు అందజేసేలా కృషి చేస్తామని ఎస్పీ జి ఆర్ రాధిక అన్నారు. సరైన పత్రాలు లేకుండా ఎవరూ మొబైల్ ఫోన్స్ కొనవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. అతి తక్కువ కాలంలోనే ఫోన్లు రికవరీ చేసి తమకు అందచేయడంతో బాధితులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఫోన్లు రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ సెల్ సిబ్బందిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :