తెలంగాణ వాహనదారులకు అలర్ట్. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం కల్పించిన డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. వాహనదారులు భారీ మొత్తంలో రాయితీతో డిసెంబర్ 26నుంచి జనవరి 10వరకూ పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు పోలీసు ఉన్నతాధికారులు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజుతో ముగియనుండగా రేపటినుంచి వందశాతం ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
ఈ మేరకు ద్విచక్రవాహనాలకు, ఆటోలకు 80, ఆర్టీసీ బస్సు(TSRTC) లకు 90, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటివరకూ ప్రభుత్వానికి దాదాపు రూ.80 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు ఆఖరి రోజు కావడంతో మిగిలిన వారు కూడా చెల్లిస్తే వంద కోట్ల ఆదాయం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ మంది పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నారని, అత్యధికంగా పట్టణాల్లోనే వసూల్ అయినట్లు చెప్పారు.