తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తునట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్ లోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆరు మండలాల నుంచి వచ్చిన ప్రజలు నుండి అర్జీలు స్వీకరించి ఎదుర్కొంటున్న సమస్యను విన్న ఎమ్మెల్యే. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ ఆయా మండలాలకు సంబంధించిన అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహించి ప్రజా వేదిక అధికారులు చేపట్టే సమస్యల పరిష్కార వేదికకు అనుగుణంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకులు అనుసరించిన దుర్మాగవు విధానాలతో పల్లెలలో ప్రశాంతత లేకుండా సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. నాటి విధ్వంసక పాలన దుష్ఫలితం నేటికీ కూడా ప్రజలను వెంటాడుతున్నదని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టి,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో మంచి ప్రభుత్వం మంచి పాలన ప్రజలకు అందించాలనే యువ నాయకుడు ఐటి విద్య శాఖ మంత్రి నారా లోకేష్ గారి పట్టుదలతో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి బయట పడాలని ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు .అధినాయకత్వం ఆదేశాలతో అనుక్షణం ప్రజా సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి తాను అంకితభావంతో పని చేస్తున్నానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలకు వర్గ విభేదాలకు ప్రాంతాల తారతన్యానికి తావు లేదన్నారు. అధికారులందరూ ప్రజలు అందించిన వినతి పత్రాలను శాఖల వారీగా పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశిస్తున్నట్లు చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంను సమస్యల రహిత తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రజల నుండి ఎమ్మెల్యే పులివర్తి నాని అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
