ప్రకాశం జిల్లా చీమకుర్తి జవహర్ నర్సింగ్ హోమ్ కుటుంబ ఆస్తి తగాదా రాజకీయ రంగు పులుముకుంది. డాక్టర్లుగా చేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడంతో తమ్ముడు కోర్టు మెట్లెక్కాడు. గత కొద్దికాలంగా కోర్టులో కొనసాగుతుంది. ఈరోజు తమ్ముడు హాస్పిటల్ దగ్గర గొడవకు రావడంతో వైసిపి నేతలను రంగంలోకి దించాడు అన్న, దీంతో తమ్ముడు టిడిపి నేతలను బరిలోకి దించాడు. కుటుంబ తగాదా కాస్త రాజకీయ రంగు పులుముకొని బజారున పడ్డ పరిస్థితి. దీంతో ఉద్రిక్త వాతావరం ఏర్పడింది. ఇద్దర్ని పోలీస్ స్టేషన్ పిలిచి సర్దిచెప్పే ప్రయత్నం చేసారు పోలీసులు.